విలువ గల ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ వితరణగద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 8 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మండల పరిధిలోని దౌదర్పల్లి గ్రామంలో రాజు అనే మేస్త్రి కూతురు హేమ(3 సంవత్సరాలు) వెన్నుముక కండరాల క్షీణత వ్యాధితో శ్వాస తీసుకోవడం ఇబ్బందికరమైన పరిస్థితులు వలన 40వేల విలువగల ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ను బుధవారము వారికి అందజేసినట్లు సోషల్ రెస్పాన్సిబిలిటీ సభ్యులు తెలిపారు.చిన్నారికి వారానికి ఒకసారి ఆక్సిజన్ పెట్టుకోవాల్సిన వస్తుందని అందుకు డబ్బు ఖర్చవుతుందనీ ఆమె తండ్రి రాజు మేస్త్రి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడని అంతటి ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల డాక్టర్లు శ్యాము, అశోక్, జయరాజు ల సహకారంతో అందించడం జరిగిందని సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంజీవ్, శివప్రసాద్, నాగరాజు, మురళి, పరశురాముడు, చందు, బెంజమిన్, సంధ్య అశోక్ తదితరులు పాల్గొన్నారు.




