Wednesday, 4 November 2026

మన ఊరు-మనబడి పనులను పరిశీలించిన డిఈఓ రమేష్ కుమార్

 

 

 

 

వేములవాడ, మే 6 (జనం సాక్షి):వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను శనివారం జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ పరిశీలించారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, డ్రింకింగ్ వాటర్ తదితర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మండల విద్యా వనరుల కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులకు యూనిఫామ్స్ నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాడు అందజేసేలా చూడాలన్నారు. ఆయన వెంట ఉపాధ్యాయులు దరిపెల్లి శ్రీనివాస్, ఎంపీపీ ఎస్ లక్ష్మీపూర్ హెచ్ఎం శిలాపురం శంకరయ్య, సిఆర్పీలు నగేష్, ఎల్లేష్, ఎం ఐ ఎస్ నవీన్, సిసిఓ ధనుంజయ్ తదితరులు ఉన్నారు.