ఇటీవల తల్లిదండ్రులు మృతి చెందగా వారి అనాధ కుమారునికి
నేను ఉన్నానంటూ చదువుకోడానికి పేదరికం అడ్డు కాకూడదు..
ఆర్థిక సాయం. తోపాటు చదువుకోడానికి గత సంవత్సరం నుండి ప్రతి నెల స్కాలర్ షిప్ అందించిన
యఫ్ టీవీ అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి
వీణవంక ఆగస్టు 29 ( జనం సాక్షి ) వీణవంక మండల కేంద్రనికి చెందిన చింతల రంజిత్ చింతల రజిత ఇటీవల మృతి చెందగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ యఫ్ టీవీ అధినేత
పాడి ఉదయ్ నందన్ రెడ్డి తల్లిదండ్రులు కోల్పోయిన
ఈ అనాధ కుమారునికి ఆర్థిక సహాయంగా తన అనుచరుల చేత ఐదు వేల రూపాయలు ఈ కుటుంబానికి ఆర్థిక సహాయం తోపాట అనాధగా ఉన్న చింతల వర్షిత్ కుమార్ కు భవిష్యత్తులో చదువుకోవడానికి పేదరికం అడ్డు రాకూడదని నేను అండగా ఉంటానని తన గొప్ప మనసుతో అందుకు ఈ అనాధ చింతల వర్షిత్ కుమార్ చదువుకోవడానికి గత సంవత్సరం మార్చి నుండి ప్రతి నెల 1000 ఒక వెయ్యి రూపాయలు స్కాలర్ షిప్ అందిస్తానని పాడి ఉదయ్ నందన్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో తో పాటు వీణవంక గ్రామ ప్రజలు పాడి ఉదయ్ నందన్ రెడ్డి కి గ్రామ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య యాదవ్. అమృత ప్రభాకర్. సమిల్ల ప్రకాష్. దాసరపు లోకేష్. దాసారపు వంశీకృష్ణ. తాళ్లపల్లి కుమార స్వామి. చిన్నాల శ్రీకాంత్. పస్తం కుమార్. బుర్ర సాగర్. కొమ్ము అఖిల్. తో పాటు తదితరులు పాల్గొన్నారు.