Tuesday, 3 November 2026

బిఆర్ఎస్ అధికారంలోకి రావాలని గుంజేడు ఆలయంలో ప్రత్యేక పూజలు

101 సార్ల మోకాల ప్రదక్షణ,ఉపవాస దీక్ష చేపట్టిన పశువుల గట్టయ్య

కొత్తగూడ ఆగస్టు 29 జనంసాక్షి:తెలంగాణ రాష్ట్రంలో తిరిగి మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని అదేవిధంగా ములుగు నియోజకవర్గంలో బాడే నాగజ్యోతి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవాలని మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గుంజేడు గ్రామంలో వెలిసిన గిరిజన ఆరాధ్య దైవం శ్రీ గుంజేడు ముసలమ్మ ఆలయ సన్నిధిలో 101 మోకాళ్ళ ప్రదర్శన,ఉపవాస దీక్ష చేపట్టిన పశువుల గట్టయ్య అనంతరం గట్టయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే కెసిఆర్ ప్రభుత్వం తోనే అభివృద్ధి చెందుతారని అన్నారు.పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీదేనని గుర్తు చేశారు.