ఎమ్మెల్యే నోముల భగత్ సమక్షంలో బీఆర్ఎస్

పార్టీలో చేరిన కాంగ్రెస్ , బిజెపి నాయకులు
తిరుమలగిరి (సాగర్) ఆగస్టు 29 (జనంసాక్షి):
మండలంలోని నెల్లికల్ గ్రామ పంచాయతీ లోని మూలతండా, మేగ్యా తాండ గ్రామ పంచాయతీ లోని భోజ్య తాండ గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్, బిజెపి నాయకులు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మంగళవారం నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే భగత్ వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మునావత్ హరి, నేనావత్ వష్య, నేనావత్ సురేష్, నేనావత భంగ్య, నేనావత్ కౌశ్య, ధనావత్ ముని పలువురు ఉన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పిడిగం నాగయ్య, జిల్లా నాయకుడు కేతావత్ బిక్ష నాయక్, ఎంపిటిసి సలహాదారుడు పాండు నాయక్, మాజీ ఎంపీటీసీ బాలు నాయక్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు మేకపోతుల కార్తీక్, యూత్ అధ్యక్షుడు జటావత్ రమేష్ నాయక్, గణేష్, ధనావత్ ఇశ్రీయ, సీత్య నాయక్, శ్రీరామ్, వడిత్య సీత్య నాయక్, ఆంగోతు హనుమంతు, ఆంగోతు ఈశ్వర్, మునావత్ రాము, కొత్తపల్లి శ్రీను, ఇరిగి గోపి తదితరులు పాల్గొన్నారు..