Wednesday, 4 November 2026

ఇటీవల మే డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చే శ్రమశక్తి అవార్డును అందుకున్న తెలంగాణ ఉద్యమకారుడు

 

 

 

 

 

 

 

 

 

రఘునాథ పాలెం మే 06 (జనం సాక్షి)ఇటీవల మే డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చే శ్రమశక్తి అవార్డును అందుకున్న తెలంగాణ ఉద్యమకారుడు భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బూరుగు మారుతీరావును బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ ఖమ్మం లోని అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం కార్యాలయంలో శాలువా మెమొంటోతో సత్కరించారు ఈ సందర్భంగా లింగాల రవికుమార్ మాట్లాడుతూ కార్మికుల హక్కులు సంక్షేమం కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అనేక హక్కులను చట్టాలను రూపొందించారని రోజుకి 12 గంటల సమయాన్ని ఎనిమిది గంటలకు కుదించడం పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత పండుగ సెలవులు మరియు స్త్రీలకు ప్రసూతి సెలవులు లాంటి అనేక ప్రయోజనాలు కార్మికులకు కల్పించారని లింగాల అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం నాయకులు తప్పేట భాస్కర్ ముత్తమాల రమేష్ ఎర్ర గంగాధర్ కొప్పుల రామారావు పప్పుల నాగేశ్వరరావు వెంకట్ కోండ తదితరులు పాల్గొన్నారు