జహీరాబాద్ మే 6 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీ వేంటనే ప్రారంభించి తక్షణమే గొల్ల కురుమలకు గోర్రెలు అందించాలని డీడీలు చెల్లించి సంవత్సరాలు గడుస్తున్న ఇంకా లబ్ధిదారులకు ఎందుకు గొర్రెలను ఇవ్వడం లేదని శ్రీ బీరప్ప కురుమ సంఘం నాయకులు మహేష్ కురుమ తీవ్రంగా మండిపడ్డారు డీడీలు చెల్లించడానికి డబ్బులు లేక నిరుపేద గొల్ల కురుమలు వడ్డీకి ఇతరుల వద్ద డబ్బులు తీసుకువచ్చి ప్రభుత్వానికి డీడీలు చెల్లించి దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వం వైపు దీనంగా ఎదురు చూస్తున్నారు అని గొల్ల కురుమలపై ప్రభుత్వానికి ఏమాత్రం ప్రేమ ఉన్న తక్షణమే రెండో విడత గొర్ల పంపిణీ చేపట్టాలని మహేష్ కురుమ డిమాండ్ చేశారు లేనియెడల ప్రాథమిక గొర్రెల పెంపకం దారుల సాహకార సంఘం సభ్యులతో ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు




