మిర్యాలగూడ, జనం సాక్షి మిర్యాలగూడ పట్టణంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను శనివారం నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కేంద్రాన్ని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ పరీక్ష కేంద్రాన్ని అదనపుకలెక్టర్ భాస్కర్ రావు సందర్శించి, పకడ్బందీ ఏర్పాట్ల నడుమ జరుగుతున్న పరీక్షల తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట మిర్యాలగూడ తహసిల్దార్ అనిల్ కుమార్ వన్ టౌన్ సిఐ రాఘవేందర్ లుఉన్నారు.





