Thursday, 5 November 2026

ఇథనాయిల్ ఫ్యాక్టరీ లను రైతులు సద్వినియోగం చేసుకోవాలి::ఇథనాయిల్ ఫ్యాక్టరీ లను రైతులు సద్వినియోగం చేసుకోవాలి:

:

 

 

 

 

జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ భా -౦౦౦౦-ఇథనాయిల్ ఫ్యాక్టరీ లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ భాష అన్నారు.    శుక్రవారం వెల్గటూర్ మండలం స్తంభంపల్లి, పాశిగామ గ్రామాలలో ఇథనాయిల్ ఫ్యాక్టరీ వలన కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  రైతులు పండించిన వరి పంటను ఎక్కువగా పండించడం వల్ల ఎక్కువ మెట్రిక్ టన్నులు ఉండడం వల్ల  ఐ.కే.పి. సెంటర్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని తెలిపారు. ఇథనాయిల్ ఫ్యాక్టరీ ల వల్ల ఉద్యోగ విషయంలో ఎక్కువగా ముందంజ లో ఉంటామని ఆమె తెలిపారు. ఇథనాయిల్ ఫ్యాక్టరీలో పెట్రోల్  కలపడం వల్ల ఎక్కువ లాభం వస్తుందని, ఫ్యాక్టరీ లోకల్ లో ఉండడం వల్ల లాభాలు మనమే తీసుకోవచ్చని, అవి జిల్లా అభివృద్దికి ఉపయోగించవచ్చని ఆమె పేర్కొన్నారు. ఒకవేళ రైతులు ఎవరికైనా అపోహలు, సందేహాలు ఉన్నట్లయితే వారు కొత్తగా నిర్మించిన  వేరే ఇథనాయిల్ ఫ్యాక్టరీలను సందర్శించాలని అనుకుంటే వారి పేర్లను లిఖిత పూర్వకంగా ఇస్తే ఒక లిస్ట్ తయారు చేసి వారి అపోహలను, సందేహాలను తోలగిస్తామని, ఇది రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, సహకార సంఘం చైర్మన్ కోడూరి రవీందర్ రావు, డిఎస్పి ఎగ్గిడి చైర్మన్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల గారిచే జారీ చేయనైనది.