జనరల్ మెడిసిన్ జనరల్ సర్జన్ యూరాలజీ విభాగాలకు అనుమతిసూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): జిల్లా కేంద్రంలోని హెల్తీ పై హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ సేవలకు అప్ గ్రేడ్ అయ్యాయి. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకం కింద అందిస్తున్న ఆర్థోపెడిక్ వైద్య చికిత్సలతో పాటు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, యూరాలజీ విభాగాలకు వైద్య చికిత్సలను అందించేందుకు ప్రభుత్వం నుండి అనుమతి లభించింది.ఈ సందర్భంగా హెల్తీ ఫై హాస్పిటల్ వ్యవస్థాపక చైర్మన్ మతకాల చలపతిరావు మాట్లాడుతూ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్ విభాగపు కేసులు, యూరాలజీ కిడ్నీ సంబంధిత వ్యాధులకు కూడా వైద్య చికిత్సలు అందించేందుకు తమకు తాజాగా ప్రభుత్వం నుండి అవసరమైన అనుమతులు లభించినట్లు చెప్పారు.ఈ అనుమతులతో ప్రజలకు మరింత సేవ చేసే అదృష్టం పొందగలిగామని అన్నారు.తమ హాస్పిటల్ నందు ఇప్పటికే ఆరోగ్యశ్రీ కింద ఆర్థోపెడిక్ విభాగం లో వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇక నుండి జనరల్ మెడిసిన్ , జనరల్ సర్జన్ విభాగం కేసులు , యూరాలజీ కిడ్నీ సంబంధిత వ్యాధులకు కూడా అవసరమైన అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపారు.ఉద్యోగులు, కార్మికులు, ఈఎస్ఐ కార్డు కలిగి ఉన్న వారు 58 రకాల అనారోగ్య సమస్యలకు తగు చికిత్సను ఉచితంగా అందించేందుకు తమ హాస్పిటల్ గతంలోనే అనుమతులు పొందినట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన వైద్యులు, ఆత్యాధునిక పరికరాలు, అత్యంత సౌకర్యవంతమైన సొంత సువిశాల నిర్మాణంతో వివిధ విభాగాల్లో వైద్య సదుపాయాల్ని అందిస్తూ ఆనతి కాలంలోనే అనితర సాధ్యమైన రీతిలో వైద్య రంగంలో తమ ప్రత్యేకతను చాటుకున్నామని అన్నారు. హెల్తీ పై హాస్పిటల్ మరో మెట్టుపైకి ఆరోగ్యశ్రీ విభాగంలో అప్ గ్రేడ్ కావటం విశేషమన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయికి ధీటుగా హెల్తీపై హాస్పిటల్ అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.




