Tuesday, 3 November 2026

ఇన్‌క్యాబ్‌ ప్రతినిధులతో మంత్రి నారాయణ భేటీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 : తాత్కాలిక రాజధాని నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కసరత్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా గురువారం ఉదయం ఇన్‌క్యాబ్‌ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. తాత్కాలిక రాజధాని నిర్మాణానికి సాంకేతిక బిడ్లపై ఈ సమావేశంలో చర్చించారు. దాదాపు 11 కంపెనీలు బిడ్లు దాఖలు చేయగా ఐదు కంపెనీలు అర్హత సాధించాయని అధికారులు మంత్రికి వివరించారు. సత్యవాణి ప్రాజెక్టు కంపెనీకి బాధ్యతలు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్‌క్యాబ్‌ ప్రతినిధులతో సమావేశం అనంతరం ఈ రోజు సాయంత్రం సీఎం చంద్రబాబుతో సమావేశమై తాత్కాలిక రాజధానిపై చర్చించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *