హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్‌లోని చైతన్యపురి మారుతీనగర్‌లో దారుణం జరిగింది. ఓ వృద్ధురాలిపై దాడి చేసి ఆమెపై ఉన్న నగలను అపహరించాడు ఓ దుండగుడు. ఈ దాడిలో వృద్ధురాలు మృతి చెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.




