మిర్యాలగూడ, జనం సాక్షి ఏప్రిల్ 7 పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని మస్జీద్ ఏ సరాయే మీరాలం లో 36 వ వార్డు కాంగ్రెస్ ఇంచార్జ్, స్వర్ణకారుల సంఘం పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ ఎండి అబ్దుల్లా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా టియుడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి అస్లాం, 46 వార్డ్ కౌన్సిలర్ సలీం, ఏఐఎఫ్బి జిల్లా అధ్యక్షులు ఎండి సమీ ఖాద్రి హాజరై మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. స్నేహభావానికి ప్రతీక ఇఫ్తార్ అన్నారు. స్వర్ణకారుల సంగం సభ్యులు షేక్ ఖాలీల్, షేక్ బాషుల ఆధ్వర్యంలో హరీస్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కరీముల్లా, యూసుఫ్ అలీ, మన్నాన్, జానీ, నాహీద్ జాంగిర్ అలీ ఆరిఫ్, నజీర్, ముజీబ్, ఆ యాజ్, గఫార్, మోహిద్, కరీం, రిజ్వాన్ ఆసిఫ్ అలీ, బషీర్, హంజా, అబ్బాస్, హబీబ్, వాజిద్ అలీ, షారుక్, తదితరులు పాల్గొన్నారు.




