Wednesday, 4 November 2026

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు తీవ్ర స్థాయిలో ఉద్యమాలు సాగిస్తాం వైయస్సార్ తెలంగాణ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పరి ప్రసాద్

 

 

 

 

 

వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 7 జనం సాక్షితెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న నిరుద్యోగ సమస్యతో అనేక మంది యువతీ యువకులు ఆత్మహత్యల పాల్పడుతున్నారని నిరుద్యోగ యువతీ యువకులను ఉపాధి అవకాశాలు కల్పించే వరకు వైయస్ ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేస్తామని వికారాబాద్ నియోజకవర్గ వైయస్సార్ తెలంగాణ పార్టీ ఇంచార్జ్ ఉప్పరి ప్రసాద్ పేర్కొన్నారు శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని కేంద్రాల ప్రభుత్వాలను నిర్లక్ష్యం వల్లే ఉపాధి లేక అనేక మంది యువతీ యువకులు ఆత్మహత్యలకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వికారాబాద్ జిల్లా కేంద్రమైనప్పటికీ ప్రభుత్వ ప్రైవేటు కర్మాగారాలు లేకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని ఆయన తెలిపారు వికారాబాద్ నియోజకవర్గంలో అణువైన ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ టెక్స్ టైల్స్ పార్కు స్పిన్నింగ్ మిల్స్ ఎంఆర్ఎఫ్ లాంటి పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశం కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరేతనట్లు వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వేణు జిల్లా అధికార ప్రతినిధి కావలి వసంత కుమార్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వీరేశం వరప్రసాద్ వికారాబాద్ మండల అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి మర్పల్లి ధరూర్ బంటారం కోటిపల్లి మోమిన్ పేట మండలాల అధ్యక్షులు గోపాల్ శశివర్ధన్ విట్టల్ చారి ఎల్లారెడ్డి కరుణాకర్ రాజేందర్ రెడ్డి తో పాటు వైయస్సార్ అభిమానులు వైయస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు