హుజురాబాద్ ఏసిపి వెంకటరెడ్డివీణవంక ఏప్రిల్ 7 (జనం సాక్షి )వీణవంక మండలం లోని చల్లూరు మరియు ఇప్పలపల్లి రెండు గ్రామాలకు చెందిన మత్స్యకారులకు చెరువుల పంపకం విషయమై ఇటీవల రెండు గ్రామాలకు ఘర్షణ జరగగా ఈరోజు శుక్రవారం హుజురాబాద్ ఏసిపి కె. వెంకట్ రెడ్డి, జమ్మికుంట రూరల్ సీఐ జె. సురేష్ మరియు ఏడి మత్స్యశాఖ ఆధ్వర్యంలో రెండు గ్రామాల మత్స్యకారులకు అవగాహన కలిగించడం జరిగింది. సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలని, చట్టాన్ని గౌరవించాలని, చట్టాన్ని చేతిలో తీసుకున్నట్లయితే కఠిన చర్యలు తీసుకోబడునని హెచ్చరించడం జరిగింది. స్థానిక ఎస్ఐ శేఖర్ రెడ్డి. వారి వెంట రెండు గ్రామాల సర్పంచులు పొదిల జ్యోతి రమేష్ ఎనుగంటి విజయ శ్రీనివాస్ తోపాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు




