రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై20(జనంసాక్షి):-యాచారం మండల కేంద్రంలో సాయి శరణం గార్డెన్ లో టిఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని టిఆర్ఎస్ పార్టీ యాచారం మండల అధ్యక్షులు కర్నాటి రమేష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో లో మండల ప్రధాన కార్యదర్శి బాష, జడ్పిటిసి చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య సహకార సంఘం చైర్మన్ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి అలాగే హరితహారం కార్యక్రమంలో భాగంగా ముక్కోటి వృక్షార్చన లో 3 లక్షల మొక్కలను మంచాల మండలంలోని కాగజ్ ఘట్ గ్రామ పరిధిలో నాటటమే లక్ష్యంగా ఇబ్రహీంపట్నంలోని గురు నానక్ కళాశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా మంత్రి కేటీఆర్ రానున్నారని తెలిపారు. మంత్రి పర్యటన సందర్భంగా యాచారం మండలం నుంచి 300 బైకుల తో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ సీనియర్ నాయకులు యూత్ సభ్యులు ప్రత్యేకంగా బాధ్యతలు చేపట్టి మంత్రి పర్యటన విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం వైస్ చెర్మెన్ కారింగ్ యాదయ్య, తెరాస మహిళా విభాగం అధ్యక్షులు మద్దెల శశికళ, మండల ప్రచార కార్యదర్శి స్వరూప, వార్డ్ మెంబర్ల ఫోరం రాష్ట్ర ప్రచార కార్యదర్శి కొలం అనంతరెడ్డి, సర్పంచ్ లు బండిమీది కృష్ణ, హాబీబుద్దిన్, అరుణ పాండు రంగారెడ్డి, మండల నాయకులు తలారి మల్లేష్, యువజన విభాగం నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కాజు మహామ్మద్, మండల అధ్యక్షుడు జానీ, ఎస్సి సెల్ అధ్యక్షుడు మండలి గోపాల్, నాయకులు బొల్లంపల్లి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.




