Wednesday, 4 November 2026

ఇమ్రాన్‌ఖాన్‌కు గాయాలు

-ప్రచార వేదికనుంచి కిందపడటంతో ఘటన

లాహోర్‌, మే 7: పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ రాజకీయ నేత ఇమ్రాన్‌ ఖాన్‌ ఫోర్క్‌లిఫ్ట్‌ వాహనసాయంతో ఎన్నికల ప్రచార వేదిక ఎక్కేప్రయత్నంలో కిందపడటంతో తలకు తీవ్ర గాయమైంది. పాకిస్థాన్‌ తెహ్రిక్‌ ఈ ఇన్సాఫ్‌ పార్టీ అధ్యక్షుడైన ఇమ్రాన్‌ ఈనెల 11న సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విస్తతృవూపచారం చేపట్టారు. ఈక్రమంలో మంగళవారం లాహోర్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అంగరక్షకులతో కలిసివేదిక ఎక్కేందుకు ప్రయత్నించగా అదుపుతప్పి కొన్ని అడుగుల ఎత్తునుంచి కిందపడ్డారు. నెత్తురోడుతున్న ఇమ్రాన్‌ను అనుచరులు హుటాహుటిన షౌకత్‌ ఖనౌమ్‌ ఆస్పవూతికి తరలించారు. ఇమ్రాన్‌ పార్టీ నాయకుడు అబ్దుల్‌ ఖాదీర్‌ మాట్లాడుతూ తలకు తీవ్ర గాయమైందని వెల్లడించారు. ప్రసుత్తం ఇమ్రాన్‌ స్పృహలోనే ఉన్నారని తెలిపారు కాగా, షియా ముస్లింలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించే లష్కర్‌ ఇ ఝాంగ్వి కరాచీ అధినేత తారిఖ్‌ షఫీనిబ బెలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో అరెస్టుచేసినట్లు పోలీసులు  పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *