మనీలా, జనంసాక్షి: ఫిలిప్పీన్స్‌లో అత్యంత క్రియాశీలంగా ఉండే మేయాన్ అగ్నిపర్వతం మంగళవారం బద్దలైంది. పెద్ద ఎత్తున లావాను, బూడిదతో కూడిన నల్లటి పొగను ఎగజిమ్ముతుండడంతో ఆ ప్రాంతంలో మధ్యాహ్నమే కారు చీకట్లు కమ్ముకున్నాయి. లావాతో పాటు పెద్ద పెద్ద రాళ్లు కూడా ఎగిరిపడుతుండటంతో వివిధ ఘటనల్లో ఐదుగురు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.




