ఎదురు కట్నం ఇచ్చి పెళ్ళి
ఇస్లామాబాద్, జనవరి 08 (జనంసాక్షి) : ఎట్టకేళకు ఇమ్రాన్ ఖాన్ ఇక ఇంటివాడయ్యాడు.. వదువుకు లక్ష రూపాయలు తానే కట్నంగా ఇచ్చి పెళ్ళి చేసుకోవడం విశేషం..
రాజకీయ నేతగా మారిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ బీబీసీ టీవీ యాంకర్ రెహమ్ ఖాన్ను గురువారం రెండవ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి
ఇస్లామాబాద్ శివారులోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ బానీ గాలా ఫామ్ హౌస్లో నిరాడంబరంగా జరిగింది. ముస్లిం సాంప్రదాయం ప్రకారం ముఫ్తీ సయీద్ ఈ నిఖాని
నిర్వహించారు. సన్నిహిత మిత్రులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ నిఖాకు హాజరయ్యారు. అత్యధిక మంది ఇమ్రాన్(62),రెహమ్(42)ల పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు.




