శ్రేణులకు అమిత్ షా పిలుపు
హైదరాబాద్,జనవరి8(జనంసాక్షి): దేశంలో బలవంతపు మతమార్పిడుల నివారించాల్సిందేనని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. ఇందుకు కఠిన చట్టాల ఆవశ్యకత ఉందన్నారు. చట్టం ద్వారానే వీటిని నిరోధించగలుగుతామని అన్నారు. ఇందుకు అందరూ సహకరించాలని బిజెపి అధ్యక్షుడు కోరారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన షా గురువారం ఉదయం విూడియా సమావేశంలోమాట్లాడారు. బలవంతపు మతమార్పిడుల నివారణకు ప్రత్యేక చట్టం అవసరమని ఆయన పేర్కొన్నారు. చట్టం తెచ్చేందుకు అన్ని లౌకిక పార్టీలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. హిందూ తల్లులు నలుగురు పిల్లలను కనాలన్న సాక్షి మహరాజ్ వ్యాఖ్యలు అతని వ్యక్తిగతమని అమిత్‌షా అన్నారు. సాక్షి మహరాజ్ వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదు. బలవంతపు మతమార్పిడుల నివారణకు అందరూ సహకరించాలి. బలవంతపు మతమార్పిడుల నివారణకు ప్రత్యేక చట్టం అవసరం. చట్టం తెచ్చేందుకు అన్న లౌకిక పార్టీలు కలిసిరావాలి. అదేవిధంగా భూ సేకరణ కోసం ఆర్డినెన్స్ తేవటంలో తప్పు లేదన్నారు. అదేవిధంగా కశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు కొనసాగుతున్నాయని, పరస్పర అవగాహనతో కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. భూసేకరణ కోసం ఆర్డినెన్స్ తేవటంలో తప్పు లేదని అన్నారు. దేశాభివృద్ధి కోసం ఆర్డినెన్స్ తేవటం అవసరమని చెప్పారు. మతమార్పిడులపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. గత ఆరు నెలల్లో మోదీ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం నింపిందని అమిత్‌షా అన్నారు. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నదని అన్నారు. ఎన్నికల హావిూల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని చెప్పారు. మోదీ నేతృత్వంలో సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బూజుపట్టిన ప్రణాళికాసంఘం స్థానే రాష్టాల్రకు ప్రాధాన్యం ఇచే గీతి తీసుకుని వచ్చామన్నారు. నిరుద్యోగ సమస్య నిర్మూలనకు మోదీ చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెట్రో ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గయన్నారు. వివిధ రాష్టాల్లో జన్ ధన్ యోజన ద్వారా పది కోట్ల అకౌంట్ లు కల్పించామన్నారు. జన్‌ధన్ యోజన కింద విజయవంతంగా 10 కోట్ల ఖాతాలు తెరిచారని వెల్లడించారు. ఆన్‌లైన్‌లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భాజపాకు 22 శాతం ఓట్లు లభించాయని పేర్కొన్నారు.
తెలంగాణలో 30 లక్షల..దేశంలో పది కోట్ల సభ్యత్వం చేర్పించాలి..ఇది బీజేపీ టార్గెట్..ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్టాల్రపై కమళ దళం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. అందులో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ రాష్టాన్రికి వచ్చారు. అనంతరం పార్టీ నేతతో భేటీ అయ్యారు. మోడీ వచ్చాక దేశ ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, ఆన్ లైన్ లో బీజేపీ సభ్యత్వ నమోదుకు మంచి స్పందన లభిస్తోందని షా పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు కొనసాగుతోందని, తెలంగాణలో 30లక్షల సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నామని, దేశవ్యాప్తంగా 10కోట్ల మంది బీజేపీ సభ్యత్వ నమోదు నిర్ణయించామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ ఉన్నాయన్నారు. నిరుద్యోగ నిర్మూలనలో యూపీఏ సర్కారు విఫలమైందని విమర్శించారు. మోడీ నిరుద్యోగ నిర్మూలనకు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం నల్లధనంపై ఏవిూ చేయలేక పోయిందన్నారు. తాము నల్లధనం ఖాతాల వివరాలను సుప్రీం కోర్టుకు ఇచ్చామని తెలిపారు. జన్ ధన్ యోజన గొప్ప పథకం అని, దీనిద్వారా 10కోట్ల ఖాతాలు తెరిచారని చెప్పారు. జన్ ధన్ పై మోడీ చెప్పిన మాటా నెరవేరిందని అమిత్ షా వెల్లడించారు. తెలంగాణలో బిజెపి బలోపేతానికి కృషి చేస్తున్నామని అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బిజెపి సభ్యత్వ నమోదు చురుకుగా సాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.
.
6. ప్రోమో..
7. స్టోరీ





