చేపల ఉత్పత్తిలో దూసుకెళ్లేలా ప్రణాళికలు
హైదరాబాద్,జూన్13(జనం సాక్షి): అమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అక్వాకల్చర్ అనేది కేవలం ఎపికి మాత్రమే పరిమితమైన వ్యాపారాంగా మారింది. ఆక్వా అనగా రొయ్యల సాగు అన్నది బలపడింది. తెలంగానలో చేపల పెంపకం, రొయ్యల పెంపకం అంతరించిపోయింది. కేవలం ఆంధ్రానుంచి వచ్చే చేపలు, రొయ్యలే దిక్కయ్యాయి. నిజానికి ఈ పరిశ్రమకు చేయూతను ఇస్తే దేశం మొత్తానికి ఉత్పత్తులను అందించే సత్తా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉండేది. కానీ అలా జరగలేదు. ఇప్పుడు విడిపోయాక రెండు రాష్ట్రాల్లోనూ ఆక్వా కల్చర్ అన్న పదం వ్యాప్తిలోకి వస్తోంది. తెలంగాణలో చేపల పెంపకానికి ఇచ్చిన ప్రోత్సాహం కారణంగా ఉమ్మడి ఎపిలో కోల్పోయిన ప్రాభవం మళ్లీ కళ్లముందు సాక్షాత్కరించింది. చేపల పెంపకం పెరిగింది. చెరువుల పునరుద్దరణ, నదుల్లో నీటి లభ్యత కారణంగా గణనీయమైన మత్స్య సంపద పెరిగింది.చేపల, రొయ్యల పెంపకంతో అనేక వ్యాపారాలు ముడిపడి ఉన్నాయి. అక్వాకల్చర్ అభివృద్ధితో విస్తారమైన ఉపాధి, ఉద్యోగావకాశాలు, వ్యాపార, వాణిజ్య లావాదేవీలు, ఎగుమతులు, దిగుమతులు పెరగడం కాయంగా కనిపిస్తోంది. దీంతో గతంలో కన్నా ఎపిలో కూడా ఇప్పుడు ఆక్వా పరిశ్రమకు ప్రోత్సాహం పెరిగింది. ఆక్వాను పర్యావరణ ముప్పు లేనంత వరకు ప్రోత్సహించడం మంచిదే. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, నదులు, సముద్రాల్లో సంప్రదాయ పద్ధతుల్లో చేపల పెంపకానికి భిన్నంగా ఆధునిక పద్ధతుల్లో, జన్యుమార్పిడితో మత్స్య సంపదను పెంపొందించే అక్వాకల్చర్ ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారు. దీంతో ప్రజల ఆహరా సమస్య తీరగలదు. సముద్రజలాల్లో సహజసిద్ధంగా పెరిగిన మత్స్యసంపదను వేగంగా కొల్లగొట్టడంవల్ల భూమి ఉపరితలం విూద అందుబాటులో ఉన్న జలవనరుల్లో చేపల పెంపకాన్ని ఉధృతం చేయడంతో ఆంద్రాలో ఆక్వా కల్చర్ పెరిగింది. తెలంగాణ రాష్ట్రం కంటే ఉపరితల జల వనరుల విస్తీర్ణంలో చాలా వెనుకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపల ఉత్పత్తిలోనూ, అక్వాకల్చర్ ఉత్పత్తిలోనూ దేశంలోనే అగ్రభాగంలో నిలిచింది. ఉపరితల జలవనరుల విస్తీర్ణంలో దేశంలోనే మూడవ స్థానంలో ఉన్న తెలంగాణ చేపల ఉత్పత్తిలో మాత్రం జాతీయ స్థాయిలో 8వ స్థానంలోవెనుకబడిపోయింది. తెలంగాణ ఏర్పడ్డ తరవాత సిఎం కెసిఆర్ ముందుచూపుతో మత్స్యకారులకు రాయితీలు ప్రకటించి చేపలు, రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహించారు. దీంతో గడిచిన మూడేండ్లుగా చెరువుల్లో ఉచిత చేప పిల్లల చేపట్టింది. ఎం కేసీఆర్ చేస్తున్న ప్రతిపాదన తెలంగాణ మత్స్యపారిశ్రామిక రంగానికి ఒక దిక్సూచి లాగా పనిచేస్తుందనడంలో సందేహం లేదు.మత్స్య పారిశ్రామిక రంగం తెలంగాణలో ఇంతగా వెనకబడిపోవడానికి ఏపీతో పోల్చినప్పుడుభిన్నమైన కారణాలు కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌కు పొడవైన సముద్రతీరంతోపాటు, బ్యాక్‌వాటర్స్, కొల్లేరు లాంటి సహజసిద్ధమైన సరస్సులు, ఉప్పునీటి కయ్యలు, బ్రాకిష్వాటర్స్లాంటి అనేకరకాలైన జలవనరులు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో కేవలం భూఉపరితల జలవనరులు మినహా చేపలపెంపకానికి మరే ఇతర వనరులు అందుబాటులో లేవు. తెలంగాణలో మత్స్యపరిశ్రమ అభివృద్ధికి ఇప్పుడు అనుసరిస్తున్న సంప్రదాయ చేపల పెంపకం విధానాలను ఒకవైపు ఆధునీకరించుకుంటూనే, మరోవైపున అక్వాకల్చర్ అభివృద్దికి ముందుకు సాగాలి. ఇటీవల టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు మన రాష్ట్రంలో అక్వాకల్చర్ అభివృద్ధికి ఉన్న అవకాశాలను, అవసరాలను కూలంకషంగా చర్చించింది. తెలంగాణలో అక్వాకల్చర్ రంగం అభివృద్దికి తొలి అడుగుగా భావించాలి. క్కడ అక్వాకల్చర్ అభివృద్ధి పరిచేందుకు ఇప్పటికే అందుబాటులో ఉన్న 77 మధ్యతరహా, భారీ నీటిపారుదల ప్రాజెక్టులున్నాయి.వీటికి తోడుగా కృష్ణా, గోదావరి నదుల విూద నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టులు, వాటికి అనుబంధంగా నిర్మిస్తున్న అనేక జలాశయాలు, పెద్దపెద్ద చెరువులు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. ఇక్కడి మత్స్యకారులు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా ప్రగతి సాధించాలి. చేపలను,రొయ్యలను ఉత్పత్తి చేస్తే అనుబంధ రంగాల్లో ఉపాధి పెరగగలదు.




