ఇల్లందును అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే హరిప్రియ
* టేకులపల్లి మండల బి ఆర్ ఎస్ అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్
టేకులపల్లి, డిసెంబర్ 15( జనం సాక్షి): ఇల్లందు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరి సింగ్ నాయక్ అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తుందని టేకులపల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్ అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కృషి, పట్టుదల తో పారిశ్రామిక క్యారడాలు ఏర్పాటు ఎం ఎస్ ఎం ఈ ( MSME) ద్వారా శిక్షణ పొందిన గ్రామీణ, పట్టణంలో ఉన్న నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి ఎమ్మెల్యే సొంత ఖర్చులతో 100 మంది నిరుద్యోగులను శిక్షణ ఇప్పిచ్చి వారికి సర్టిఫికెట్ తో పాటు వారికి డి పి ఆర్ చేపియడంలో సలహాలిస్తూ వారికి 22 కోట్ల 95 లక్షల రూపాయలను ఎస్బిఐ (SBI )వారి సహకారంతో MSME శిక్షణ పొందిన వారికి అందించారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియకు అభినందనలు తెలుపుతూ హర్ష వెనబుచ్చారు. ఇల్లందు నియోజకవర్గంలో కొన్ని వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కు శ్రీకారం చుట్టారన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు అభివృద్ధి సాధించిన వాటిలో రెండు వైద్య విధాన పరిషత్తులు,
రెండు ఏకలవ్య స్కూలు, బస్ డిపో, ప్రజా భవనం,
ఉచిత కోచింగ్, భోజన సదుపాయంతో, ఉచిత వైద్యశాల, గ్రామీణ ప్రాంతాల్లో సిసి రోడ్లు,
గ్రామాలకు లింకు కలుపుతూ బీటీ రోడ్లు, చెక్ డ్యాములు,టేకులపల్లి మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ తదితర అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఎంతో పట్టుదలతో కృషిచేసి సాధించిందని అన్నారు. రానున్న రోజుల్లో మరి ఎంతో అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారని, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే హరి�




