Wednesday, 4 November 2026

ఇల్లు ఖాళీ చేయమంటుండ్రు.. గూడు చూపండి సారు

ఇల్లు ఖాళీ చేయమంటుండ్రు.. గూడు చూపండి సారు.

“ప్రజావాణి”లో కలెక్టర్ ను కోరిన వృద్ధ దంపతులు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జనవరి 9. (జనంసాక్షి). అదృష్టం వరించిన అవకాశం చేతిదాకా వచ్చిన గూడు చేరారక పోవడంతో నిరుపేద చేనేత వృద్ధ దంపతులు కన్నీరు మున్నిరవుతున్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో నిరుపేదల అద్దె ఇంటి కష్టాలను స్వయంగా చూసిన మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట తారక రామారావు ప్రత్యేక చొరవతో పేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వమే కట్టించి ఇస్తున్న విషయం తెలిసింది. పలుమార్లు సర్వేలు చేసి అర్హులను గుర్తించిన అధికారులు డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. డ్రాలో కూడా అర్హత పొందిన ఇల్లు రాక నిరుపేద కుటుంబం కన్నీరు మున్నీరవుతుంది. డ్రాలో ఎంపికైన లబ్ధిదారులకు విడుతలవారీగా ఇండ్లు మంజూరు చేయడం తో పలువురు నిరుపేదలు తమకు ఇల్లు వస్తుందో రాదో అన్న ఆందోళనలు ఉన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మా నగర్ కు చెందిన నాగుల అంబవ్వ డ్రా లో అర్హత సాధించింది. నెలలు గడుస్తున్నా తమకు ఇల్లు చూపించడం లేదని కన్నీరు మున్నీరవుతుంది. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పరమగ్గల కార్మికుడైన తన భర్త బాలయ్యతో కలిసి కూతురు వద్ద ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపింది. కూతురు కూడా అద్దె ఇంట్లో నివాసం ఉండడంతో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఇల్లు ఖాళీ చేయమంటూ ఒత్తిడీ చేస్తున్నారని తెలిపింది. గూడు చూపించి తమను ఆదుకోవాలని కోరుతూ భర్తతో కలిసి సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ ను వేడుకుటు తుంది.