Wednesday, 4 November 2026

ఇళ్ల స్థలాలు మంజూరు చేసే వరకు ఉద్యమం ఆపేది లేదు టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రిలే దీక్ష మద్దతు తెలిపిన వివిధ సంఘాల నాయకులు

 

 

 

 

 

 

 

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా:(జనం సాక్షి)06 మే:తెలంగాణలో వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్లస్థలాలు మంజూరు చేసే వరకు పోరాటం ఆపేది లేదని టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గణపురం మహేశ్, రాజశేఖర్ లు పునరుద్ఘాటించారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఇండ్లు ఇళ్ల స్థలాల కోసం నిర్వహించిన రిలే నిరాహారదీక్ష జాతీయ కౌన్సిల్ సభ్యులు సురేందర్ రావ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సతీష్ ల ఆధ్వర్యంలో చేపట్టి, అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ తో వివిధ రకాల నిరసనలు ఇప్పటివరకు తెలిపామన్నారు. దీనిలో భాగంగా గతంలో జర్నలిస్టుల సంతకాల సేకరణ తోపాటు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చామన్నారు. ప్రభుత్వ నుండి స్పందన లేకపోవడంతో రిలే దీక్ష చేపట్టినట్లు వివరించారు. భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావడంతో పాటు ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇండ్లు మంజూరయ్యే వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి జర్నలిస్టులు పనిచేస్తున్నారని ప్రభుత్వం గుర్తించి సమస్యలు పరిష్కరించాలని, ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు ఇవ్వడంతో పాటు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. గృహలక్ష్మి పథకంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జర్నలిస్టు బందు ఏర్పాటు చేయాలన్నారు. టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షకు టియుడబ్ల్యూజె ఐజేయు నాయకులు వేణుగోపాల్, అడప సతీష్, బిక్కాజి ఆసిఫాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చిప్ప సురేష్, సభ్యులు శ్రీనివాస్, నితీష్, రమేష్, సంతోష్ లు, పంచాయతీ సెక్రెటరీ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజెఎఫ్ నాయకులు కృష్ణమోహన్ గౌడ్, మార్క విష్ణుగౌడ్, ఎం. రవి, బాలాజీ, జయంత్, ధనుంజయ్, ప్రకాష్, జానకిరామ్, నాగేందర్, దుర్గం రవీందర్, రాజేష్, భీమ్ రావు, లింగయ్య, శ్రీనివాస్, పాల్గొన్నారు