Wednesday, 4 November 2026

పలు ఎరువుల దుకాణాల తనిఖీలు నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి రామక్రిష్ణ

 

 

 

 

 

 

 

కాగజ్ నగర్ గ్రామీణం/చింతల మానేపళ్లి: (జనం సాక్షి)06 మే చింతలమానేపల్లి మండలంలోని పలు విత్తన, ఎరువుల, పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా డీలర్లలకు పలు సూచనలు చేయడం జరిగింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న దృష్ట్యా జీలర్లు అందరూ రైతులకు కావలసిన ఏరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. డీలర్లు అందరూ స్టాక్ రిజిస్టర్స్ బిల్బుక్స్ సంతకాలు చేపించుకోవాలని అన్నారు. షాప్ ఉన్న విత్తనాలు, ఎరువులు అందరికి కనిపించే విధంగా స్టాక్ బోర్డు పై వ్రాయాలని అన్నారు. డీలర్ లకు ఎవరు కూడా గ్లైసిల్ విత్తనాలు, గ్లైఫోసేట్ విక్రయాలు చేయకుడదని హెచ్చరించారు. గైసిల్ విత్తనాలు ఎవరైనా విక్రయిస్తే వ్యవసాయశాఖకు కాని పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని అన్నారు. రైతులకు బిల్లులు తప్పకుండా ఇవ్వాలని అన్నారు. లైసెన్స్ అందరికి కనిపించే విధంగా ఉంచాలని ఎరువుల దుకాణాల యజమానులను అన్నారు. రైతులు అందరూ విత్తనాలు తీసుకొనే సమయంలో డీలర్లు ఇచ్చిన స్లీప్ లు జాగ్రత్తగా ఉంచుకోవాలని అన్నారు. విత్తన వ్యాపారులు వారి వద్ద ఉన్న లైసెన్స్లు సరిగ్గా ఉన్నాయో లేదా చూసుకొని రెన్యువల్ చేసుకోవాలని అన్నారు. రైతులు వేసవి దుక్కులు చేసుకోని, సీజనకి కావలసిన విత్తనాలు, ఎరువుల విషయంలో ఏదైనా సమస్యలు వ్యవసాయ అధికారిని సంప్రదించాలని కోరారు.