ఇషాక్ కుటుంబాన్నీ ప్రభుత్వo ఆదుకోవాలిఇషాక్ కుటుంబాన్నీ ప్రభుత్వo ఆదుకోవాలి
విద్యుత్ ప్రమాదంలో చేతులు కోల్పోయిన ఇషాక్ ను పరామర్శించిన ఎమ్మెల్సీ జీవన్
రూ.10 వేల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల, నవంబర్ 30
విద్యుత్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ విద్యుత్ ప్రమాదంలో చేతులు కోల్పోయిన ఇషాక్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపుర్ కు చెందిన ఇషాక్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన విషయం తెలుసుకొన్న ఇషాక్ ఇంటికీ వెళ్లి బుధవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఇషాక్ కుటుంబానికి జీవన్ రెడ్డి రూ.10 వేల ఆర్థికసాయం అందించారు. ఈసందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రమాదంలో చేతులు కోల్పోవడంతో ఉపాధి కరువైందని, అధికారులు తక్షణమే స్పందించి ఆర్థిక సహాయం అందించడంతో పాటు ప్రభుత్వం ఇషాక్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.సంక్షేమ పథకాల్లోనూ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు
ఇషాక్ కుటుంబాన్నీ ప్రభుత్వo ఆదుకోవాలిఇషాక్ కుటుంబాన్నీ ప్రభుత్వo ఆదుకోవాలి




