జగ్గయ్యపేటరూరల్(కృష్ణా): జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకున్న వీఆర్‌వోపై వాహన యజమాని దాడి చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ శివారులో ఉన్న పాలేరు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో వీఆర్వో మస్తాన్‌వలి అక్కడికి చేరుకున్నారు. ట్రాక్టర్ యజమాని మంగయ్య తన వాహనాన్ని ఆపినందుకు వీఆర్వోతో గొడవపడి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై చిలకల్లు పోలీసులకు వీఆర్వో ఫిర్యాదు చేశారు.




