Tuesday, 3 November 2026

ఈఏడాదికి పాతపద్ధతిలోనే వైద్య విద్య ప్రవేశాలు: సుప్రీంకోర్టు

-నీట్‌పై సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు

-ఈ ఏడాది నీట్‌ తప్పనిసరి కాదు

-ఎంసెట్‌తోనే ప్రవేశాలు

న్యూఢిల్లీ : వైద్యవిద్య ప్రవేశపరీక్ష నీట్‌పై సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాదికి పాతపద్ధతిలోనే వైద్య విద్య ప్రవేశాలు నిర్వహించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ ఏడాదికి నీట్‌ తప్పనిసరి కాదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ ఏడాదికి పాతపద్ధతి కొనసాగించవచ్చంది. దాంతో రాష్ట్రంలో ఈ ఏడాది ఎంసెట్‌ ద్వారానే వైద్య ప్రవేశాలు జరుగుతాయి. వైద్య విద్యార్థుల భవిష్యత్తును, ప్రజల అరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాదికి నియమ నిబంధనలను పూర్తి చేసిన తర్వాతనే తీర్పు వెలువరిస్తామని, న్యాయస్థానం పేర్కొంది. ఎంసీఐ, వివిధ రాష్ట్రాల నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *