కైరో : ఈజిప్టులో ఆందోళనలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో దేశ అధ్యక్షుడు మోర్సీ పలు నగరాల్లో ఎమర్జెన్సీ విధించారు. హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో మూడు తీరప్రాంత నగరాలు పోర్ట్‌సెడ్, సీయెజ్, ఇస్మేలియాల్లో రాత్రి కర్ఫ్యూతోపాటు ఎమర్జెన్సీని నెలరోజులపాటు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. జాతి ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్టేట్ టెలివిజన్‌లో వెల్లడించారు. అల్లర్లలో చనిపోయిన, వారి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారుకు, పోలీసులకు మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి తాజా ఘర్షణలకు దారి తీసింది. రెండు రోజుల్లో చోటు చేసుకున్న అల్లర్లలో మొత్తం 38 మంది మృతి చెందారు.




