హైదరాబాద్,జూన్30(జనం సాక్షి): ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి కెటిఆర్ పునరుద్ఘాటించారు. అనేక పరిశ్రమలు తెలంగాణకు వస్తున్నాయని అన్నారు. ఐటి, ఫార్మా రంగాల్లో మనమే మేటని అన్నారు. శావిూర్‌పేటలోని బయోటెక్ పార్క్‌ఫేజ్2లో ఉన్న ఫెర్రింగ్ ల్యాబొరేటరీస్ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ల్యాబొరేటరీస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. లైఫ్ సైన్సెస్ లో ప్రత్యక్షంగా 2 లక్షల మంది, పరోక్షంగా 4 లక్షల మంది పనిచేస్తున్నారన్నారు. రానున్న పదేళ్లలో లైఫ్ సైన్సెస్ లో ఉపాధి అవకాశాలు రెండు రెట్లకు పెరుగుతాయన్నారు. 19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫార్మా రంగంలో హైదరాబాద్ నుంచే అత్యధిక ఎగుమతులు జరుగుతున్నాయన్నారు. మెడికల్ డివైజెస్ క్లస్టర్ ను ఏర్పాటు చేసినమన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని మంత్రి తెలిపారు.




