ఈటల ను కలిసిన మంచిర్యాల బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు
రామకృష్ణాపూర్, (జనంసాక్షి) :బి జె పి ఎస్.సి. మోర్చా జిల్లా అధ్యక్షులు పత్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బి జె పి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజురాబాద్ శాసన సభ్యులు, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ని సోమవారం హుజురాబాద్ లోని ఎం ఎల్ ఏ క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పత్తి శ్రీనివాస్ మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గంలోని పార్టీ విషయాలను, బి ఆర్ ఎస్ పార్టీ వల్ల ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు, అనేక విషయాలను విన్నవించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వేలాల ఉపసర్పంచ్ డేగ నగేష్, చెన్నూర్ పట్టణ అధ్యక్షుడు సుద్ధపెళ్ళి సుశీల్ కుమార్, రామకృష్ణాపూర్ పట్టణ ఉపాధ్యక్షుడు జంగపెల్లి మల్లయ్య, వైద్య శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఏల్పుల సత్యనారాయణ, చింతల శ్రీనివాస్, ఓబీసీ పట్టణ అధ్యక్షుడు వీరమళ్ళ రాజయ్య,
బి జె వై ఎం పట్టణ అధ్యక్షుడు కున్సోత్ సంతోష్ రామ్ నాయక్, రాంకిషోర్, ఎస్ సి మోర్చా జిల్లా కార్యదర్శి ఎరుకల నరసింహరాజు , కల్లేపెళ్ళి నవీన్, బూత్ అధ్యక్షులు ఉర్స్ నర్సయ్య, బాలాజీ, స్వామి, లక్ష్మన్, బెజ్జంకి కవిత, ధనలక్ష్మి, రాజలింగు ,నరసింహ, ప్రవీణ్, మేకల రమేష్ , వెంగల రమేష్, మల్లెపూల అనిల్ తదితరులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.