పేద వర్గాలకు అండగా సీఎంఆర్‌ఎఫ్ పథకం – మండల పార్టీ అధ్యక్షుడు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి
జనంసాక్షి , కమాన్ పూర్: పేద వర్గాలకు సీఎంఆర్‌ఎఫ్ పథకం అండగా నిలుస్తుందని మండల పార్టీ అధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. కమాన్‌పూర్ మండలం పెంచికల్ పేట్ గ్రామానికి చెందిన జంపాల మధునమ్మ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ద్వారా ముఖ్యమంత్రి సహయ నిధికి సిఫార్సు చేసుకోగా, జంపాల మధునమ్మ కు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ.10 వేల చెక్కును బీఆర్‌ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ, జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు ఆదివారం స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ కొండ వెంకటేష్, బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఎద్దు రాజయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాచకొండ రవి, బైరి అంజయ్య, గండికోట రాములు, భూతపల్లి కిట్టు, ఐట్ల పవన్ కళ్యాణ్, ఉదయ్ కుమార్, కంది వంశీ, మబ్బు హరిక్రిష్ణ, కమ్మటి సాయి, కోండిల్ల విష్ణు, కె. రమేష్, పిడుగు ఓదెలు, అనవేన నర్సయ్య, పిడుగు శ్రీను, ఈ. శ్రీధర్, మల్యాల భాస్కర్, కందుల మధు, సాన సురేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.