Wednesday, 4 November 2026

ఈటెల రాజేందర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం

సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి, జూన్ 5   :  —-ఈటెల రాజేందర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంగారెడ్డి అసెంబ్లీ ఇంచార్జ్ రాజేశ్వరరావు దేశ్పాండే అన్నారు. బుధవారం బిజెపి రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ గా ఎన్నిక అయిన హుజురాబాద్ శాసనసభ్యుడు ఈటల రాజేందర్ ను  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంగారెడ్డి అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ రాజేశ్వర్రావు దేశ్పాండే కలిసి  ఘనంగా సన్మానించారు. బుధవారం ఉదయం షామీర్ పెట్ లోని ఆయన నివాసంలో పుష్పగుచ్చం అందించి శాలవతో సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీ రాజేశ్వరరావు దేశ్పాండే  మాట్లాడుతూ ఈటెల రాజేందర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందన్నారు . కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ గార్ల సారథ్యం లో బీజేపీ ప్రజలకు చేరువకానున్నాదని అభివర్ణించారు.  ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న బిఆరెస్ పాలన కు చివరి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు.  రానున్న ఎన్నికల్లో ప్రజలు బిజెపికి పట్టడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వెంకట నరసింహారెడ్డి మందుల నాగరాజ్ దోమల విజయకుమార్ రాకేష్ గౌడ్ భాను తదితరులు పాల్గొన్నారు