ఏటూరునాగారం( జనం సాక్షి) జూలై; 05
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఏటూరునాగారం ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు అఫ్జల్ పాషా అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ, ప్రజాప్రతినిదుల సహకారంతో ప్రెస్‌క్లబ్ స్థలాన్ని కేటాయించుకోడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ఇళ్ల స్థలాలు, ఇళ్లు కూడా కేటాయించుకునే విధంగా కావాల్సిన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. జర్నలిస్టుల అక్రిడేషన్, ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకపోతామన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫలాలు, హక్కుల సాధనకై ఐక్యంగా కలిసిగట్టుగా ప్రయత్నాలను ముమ్మరంగా చేద్దామన్నారు. కార్యక్రమంలో ఏటూరు నాగారం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి అలువాల శ్రీను, నూక ప్రభాకర్, కుదురుపాక రాజేష్, గణపనేని శేఖర్, రవి, ముండ్రాతి సాయి, వసంతర రమేష్, తోట తిరుమల్, పర్వతాల లాలయ్య, బోడ సత్యం, ఇర్సవడ్ల భిక్షపతి, ఎగ్గడి వెంకటేశ్వర్లు, ఎంపెల్లి లకుమయ్య, కందకట్ల శ్రీనివాస్, సాయిని శ్రీనివాస్, కర్రి రవి, గుండెల శ్రీనివాస్, సందీప్, శేరి శ్రీనివాస్, ఎగ్గడి రవి, పిట్టల శివ, గంజి రమేష్, ఉదయ్, ఠాగూర్, అలువాల శ్రీనివాస్, బొలసాని గౌరిశంకర్,శ్రీరాం రాజ్‌కుమార్, తాల్లపళ్లి గోపి సంపటి దామోదర్ క్రాంతి, గోవర్ధన్, రవితేజ పాల్గొన్నారు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి ఏటూరునాగారం ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు అఫ్జల్




