మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే పలు అధికారిక కార్యక్రమాలకు తన వ్యాఖ్యానం, సభా సమన్వయం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతానికి సేవలు విశిష్ట సేవలు అందిస్తున్న జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాఖ్యాత, కవి,కళాకారుడు గుండేటి యోగేశ్వర్ ను జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ , డి.సి.పి సుధీర్ రాంనాథ్ కెకన్, అదనపు పాలనాదికారి బి. రాహుల్ , ట్రైనీ కలెక్టర్ పి .గౌతమి లతో కలిసి ఘనంగా సన్మానించి ఆయన సేవలను ప్రశంసించారు.మంగళవారం రాత్రి నూతన ” కలెక్టరేట్” సమీకృత జిల్లా అధికారుల సముదాయం కలెక్టరేట్ (ఐ డి.ఓ.సి ) లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన నూతన కలెక్టరేట్ విజయోత్సవ సమావేశంలో వ్యాఖ్యాత యోగేశ్వర్ ను సన్మానించారు.
కాగా ఇటీవల నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో,గత సం. నిర్వహించిన ఆజాద్ కి అమృత్ ఉత్సవాలను, అనేక తన అద్భుతమైన వ్యాఖ్యానాన్ని తెలుగు, హిందీ,ఇంగ్లీష్ భాషల్లో సందర్భోచిత పదాలను పేరుస్తూ, సాహిత్యాన్ని జోడిస్తూ ఉత్సవాల విజయ వంతానికి, పలు ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా తనవంతుగా స్వచ్ఛంద సేవలు అందించారు. మంచిర్యాల జిల్లా పరిషత్ (బాలుర) ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న యోగేశ్వర్ గత 30 సంవత్సరాలుగా సుమారు10 వేలకు పైన పలు ప్రభుత్వ శాఖల, స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలకు తనదైన శైలిలో వ్యాఖ్యానం అందించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో ప్రశంసలు అందుకున్నారు.
ఈ సందర్భంగా డీ.ఈ.ఓ. యాదయ్య, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కే. సురేశ్, డి.పి.ఆర్. ఓ. సంపత్ కుమార్,వివిధ అధికారులు సంగర్షు సంతోష్ కార్యాలయ అధికారులు.సత్యనారాయన, నవీన్, సెక్టోరియల్ అధికారులు అధికారులు శ్రీనివాస్ ,చౌదరి మూర్తి, హెచ్.ఎం..వేణు గోపాల్, పలువురు ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు, వ్యాఖ్యతలు,అభినందించారు.




