యాదాద్రి భువనగిరి జిల్లాజనం సాక్షి న్యూస్ మే 06ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన తుర్కపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు ,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన శివరాత్రి ప్రభాకర్ హైదరాబాదులో కూలి పని చేస్తూ జీవనం సాగించేవాడు. రెండు రోజుల క్రితం గ్రామానికి కుటుంబం సమేతంగా వచ్చారు. శనివారం ఉదయం అతని రెండవ కుమారుడైన శివరాత్రి నరేష్ (20)స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళాడు. ఈత రాకపోవడంతో బావిలో మునిగి చనిపోయాడు .ఇట్టి విషయన్నీ తెలుసుకున్న గ్రామస్తులు పోలీస్ వారికి సమాచారం అందించడంతో గ్రామస్తులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేందర్ గౌడ్ తెలిపారు.




