కాగజ్ నగర్ గ్రామీణం: చింతల మానేపల్లి:(జనం సాక్షి)06 మే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే సహదేవ్ రావ్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు, ప్రజా, భూ, సమస్యలు, పెన్షన్ల సమస్యలు చెప్పుకునేందుకు పల్లెల్లో ప్రత్యేక ప్రజావాణి కార్య క్రమం ఏర్పాటుచేశారు, సిర్పూర్ టీ నియోజకవర్గంలోని చింతలమానేపల్లి మండలం బాబాపూర్ ఆశ్రమ పాఠశాలలో గ్రామీణ ప్రజావాణి నిర్వహించి ప్రజలనుంచి అర్జీలు స్వీకరించారు,ఈ కార్యక్రమంలో. జే సి రాజేశం ఆర్డీవో సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప, ఎమ్మార్వో మస్కుర్ అలి , ఏం,పీ,పీ డుబ్బుల నానయ్య, జెడ్ పీ టీ సీ డు బ్బుల శ్రీదేవి వెంకన్న,బి ఆర్ ఎస్ నాయకులు రైతులు పాల్గొన్నారు,




