Wednesday, 4 November 2026

ఈదురు గాలికి కూలిన చెట్టు

చిలప్ చేడ్ /జూన్ /జనంసాక్షి :- ఈదురు గాలికి కూలిన చెట్టు మండల పరిధిలోని చిట్కుల గ్రామంలో భారీగా వీచిన ఈదురుగాలికి చెట్టు కూలడంతో అక్కడే ఉన్నటువంటి పంచర్ షాప్ డబ్బా పైన పడడంతో డబ్బా పగిలిపోవడం జరిగింది బాధితుడు మల్లెగారి రాజు తను నిత్యం జీవన ఉపాధి కలిగించే పంచర్ డబ్బా పగిలిపోవడంతో అతనికి ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుందని బాధితుడు ఆరోపించాడు తను నిత్యం పంచర్ షాపు పని చేసుకుంటూ జీవనోపాది సాగించేవాడినని ఈదురుగాలికి పంచర్ డబ్బా పగిలిపోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచడం లేదని తనకు స్థానిక ఉన్నతాధికారులు తనకు జరిగిన నష్టాన్ని గుర్తించి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందించాలని బాధితుడు మలేగారి రాజు వేడుకున్నాడు