Wednesday, 4 November 2026

ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణ పనులకు సహకరించాలి. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

 

వీణవంక, జూన్ 04 (జనం సాక్షి ) వీణవంక మండల అభివృద్ధి కోసం చేస్తున్న వీణవంకలో ఫోర్ లైన్ రోడ్ నిర్మాణ పనులకు గ్రామ ప్రజలు సహకరించాలని , ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కోరారు. వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామ చివర 20 మోరీల నుండి వీణవంక వాగు వరకు 3 కి.మీ.ల పొడవున రూ.20.80 కోట్లతో ఫోర్ లైన్ రోడ్లు నిర్మిస్తున్న పనులకు మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో ఆదివారం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మండల ప్రజాప్రతినిధులతో కలిసి కొబ్బరికాయ కొట్టి, ముగ్గుపోసి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసిందని సుమారు రూ. 29 కోట్లతో మండల కేంద్రంలో ఫోర్ లైన్ రోడ్డు పనులతో పాటు సెంట్రల్ లైటింగ్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అనంతరం వేద పండితులు గూడ జగదీశ్వర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక – తిరుపతి రెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల సాదవ రెడ్డి, వైస్ఎంపీపీ లత- శ్రీనివాస్, సర్పంచ్లు నీల కుమారస్వామి, రమేష్, నర్సయ్య, ముత్తయ్య, మోరె సారయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గంగాడి తిరుపతిరెడ్డి, భూమయ్య, మల్లయ్య, రాజు, మొండయ్య, మహిపాల్ రెడ్డి, మహేశ్, తో పాటు తదితరులు పాల్గొన్నారు.