Thursday, 5 November 2026

ఈద్గా,బిస్మిల్లా మసీదులలో ముస్లిం కమిటీ అధ్యక్షునికి సన్మానం

ఈద్గా,బిస్మిల్లా మసీదులలో ముస్లిం కమిటీ అధ్యక్షునికి సన్మానం*
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 07,
జనంసాక్షి:
ఇటీవల జరిగిన మర్కాజి ఇంతేజామి ముస్లిం కమ్యూనిటీ ఎన్నికలలో పట్టణ అధ్యక్షులుగా గెలుపొందిన మహమ్మద్ ఖుతుబోద్దిన్ పాషా తో పాటు కౌన్సిలర్ మహమ్మద్ షాకీర్ సిద్ధికి ని ముస్లిం మత పెద్దలు, యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు. మెట్పల్లి పట్టణంలోని ఈద్గా, బిస్మిల్లా మసీద్ లలో వేరువేరుగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షునికి సహాయ సహకారాలు అందిస్తామని యూత్ సభ్యులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రహాఫ్, ఎజాస్, మతిన్, సలీం అజహర్, షేక్ ఉస్మాన్, సయ్యద్ హుస్సేన్, రఫీ ఉల్లా, ఇలియాస్, సోహెల్,ఇర్ఫాన్, ముస్లిం    యూత్ సభ్యులు పాల్గొన్నారు.