Thursday, 5 November 2026

కోటగిరిలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన. పోచారం సురేందర్ రెడ్డి.

కోటగిరిలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన.
పోచారం సురేందర్ రెడ్డి.

కోటగిరి డిసెంబర్ 7 జనం సాక్షి:-పేద ప్రజల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని అమలుపరుస్తుందని బాన్సువాడ నియోజకవర్గ తెరాస పార్టీ ఇంచార్జీ పోచారం సురేందర్ రెడ్డి పేర్కొన్నారు.బుధవారం రోజున కోటగిరి మండల కేంద్రానికి చెందిన ఎల్లుట్ల గజేందర్,కోటగిరి సహకార సంఘం డైరెక్టర్ కాపు గాండ్ల వీరేశం వార్ల సొంత స్థలంలో నిర్మించుకున్న రెండు పడకల ఇళ్లను కుటుంబ సభ్యుల సమక్షంలో పోచారం సురేందర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఆయనను శాలువతో సన్మానించారు.ఈ కార్యక్రమం లో హౌసింగ్ డీ.ఈ నాగేశ్వరావు,ఎంపీపీ వల్లేపల్లి సునిత శ్రీనివాస్,స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్,స్థానిక సింగిల్ విండో చైర్మన్ కూచి సిద్ధయ్య,మండల బీసీ సేల్ ప్రసిడెంట్ బీర్కుర్ సంతోష్,గ్రామ తెరాస పార్టీ అధ్యక్షులు కులకర్ణి అనిల్,ప్రధాన కార్యదర్శి కప్ప సాయిలు,పాకల సాయిలు,లబ్ధిదారుల కుటుంబ సభ్యులు,తదితరు లు పాల్గొన్నారు.