గద్వాల్ ఆర్ సి జూన్ 29, (జనం సాక్షి )
మానవ జీవితాన్ని ఆదర్శ వంతంగా రూపొందించుకునే అద్భుతమైన సంస్కృతిని మన పండుగలు వెల్లడిస్తున్నాయని రాజీవ్ రెడ్డి అన్నారు. బక్రీద్ పండుగ పర్వదిన సందర్భంగా జిల్లాలోని ముస్లిం సోదరులకు వారి కుటుంబాలకు ఈద్గాదగ్గర వెళ్లి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పవిత్ర పండుగను భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని,జిల్లాలోని ముస్లిం ప్రజలలో ఉన్న ప్రత్యేకమైన ఐకమత్యం ఎంతో ఆదర్శం అని తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ మాలిచేటి రాజీవ్ రెడ్డితో పాటు పటేల్ ప్రభాకర్ రెడ్డి ఇసాక్ కార్యకర్తలకు నాయకులకు ముస్లిం మత పెద్దలకు బక్రీద్ పండుగ శభాకాంక్షలు తెలిపారు.
ఈద్ ఉల్ అధా శుభాకాక్షలతో మలిచెటి రాజీవ్ రెడ్డి




