Tuesday, 3 November 2026

కొల్చారం మండల వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు.

జనం సాక్షి/ కొల్చారం మండల కేంద్రంలో బక్రీద్ పండగ వేడుకలు ముస్లింలు ఘనంగా నిర్వహించారు. భక్తికి, త్యాగానికి ,సహనానికి, ప్రతీక, బక్రీద్ పండుగ దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకుంటారు. ఉదయమే కొత్త బట్టలు ధరించి స్థానిక షేక్ షాబుద్దీన్ దర్గా వద్ద అల్లాహు ఆశీస్సులు తీసుకోవడానికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు అనంతరం నిరుపేదలకు దానధర్మాలు చేయడం బక్రీద్ పండుగ విశిష్టత పేదల పట్ల జాలి దయ కలిగి ఉండడమే బక్రీద్ ఇచ్చే సందేశం అని ముస్లిం మైనార్టీలు తెలిపారు. పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ సోదరులు షేక్ షాబుద్దీన్ దర్గా వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు మృతి చెందిన తమ పెద్దలను స్మరించుకుంటూ బక్రీద్ వేడుకలు నిర్వహించారు