కొత్తగూడ జూన్ 29 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో గాంధీనగర్ లో మజీద్ కమిటీ ముస్లిమ్ మండల అధ్యక్షులు అజ్మీర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసి ముస్లిం ఆచార ప్రకారం భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేయడం జరిగింది.పోలీసులు భారీ బందొబస్త్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా స్థానిక ఎస్ఐ నగేష్ పాల్గొనడం జరిగింది.అనంతరం మాట్లాడుతూ త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని అన్నారు.ముస్లిమ్ సోదరులకు వారి కుటుంబ సభ్యులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.త్యాగం సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు.దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగామేఈపండుగఅనిఅన్నారు.భక్తిభావం,విశ్వాసం,కరుణ,ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలన్నారు.ఈ పండుగ సోదర భావం ఐక్యతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.అల్లాహ్ ఆశీస్సులు మండల ప్రజలందరకీ ఎల్లప్పుడు ఉండాలని అన్నారు.జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా విశ్వాసాన్ని కల్గి,సన్మార్గంలో జీవనాన్ని సాగించాలనే గొప్ప సందేశాన్ని బక్రీద్ పండుగ మానవాళికి ఇస్తుందని తమకు కలిగినదాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటిలేదనే స్పూర్తిని బక్రీద్ పండుగ కలిగిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమం లో మత గురువు మధస్సిర్,కోఆప్షన్సభ్యులుసయ్యద్,మాతాపెద్దలుయాకుబ్పాషా,అన్వార్,సర్వర్,ఇస్మాయిల్,ఆఫ్సార్,ఖాజా,దస్తగిరి,సల్మాన్సద్దాం,అక్రమ్,ఇమ్రాన్ పోలీసులు భోజ్య నాయక్,కిషోర్,కేంద్ర బలగలు పాల్గొన్నారు.
త్యాగానికి ప్రతీక బక్రీద్ అల్లాహ్ ఆశీస్సులు మండల ప్రజలందరకీ ఎల్లప్పుడు ఉండాలి ఎస్ ఐ నగేష్




