కురవి జూన్/ 6/ జనం సాక్షి న్యూస్ :కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ద్వజ మెత్తుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఈనెల 11న కొత్తగూడెం జరిగే ప్రజాగర్జన సభను జయప్రదం చేయాలని పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కురవి మండల కేంద్రం పార్టీ నియోజకవర్గ కార్యాలయం లో ప్రజాగర్జన గోడ పత్రికలను ఆవిష్కరించి ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విభజన హామీలైన బయ్యారంలో ఉక్కు పరి శ్రమ ఏర్పాటు చేయకుండా, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల హామీని నెరవేర్చకుండా, నల్ల డబ్బు వెనక్కి తీసుకు రాకుండా, ప్రజలను మోసం చేశారని రాష్ట్ర ప్రభుత్వం రైతుల లక్ష రూపాయలు రుణమాఫీ చేయకుండా ,డబుల్ బెడ్ రూములు ఇవ్వకుండా, దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వకుండా, పోడు రైతుల సమస్య పరిష్కరించకుండా, రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలను మాయమాటలతో మభ్య పెట్టే పాలకవర్గాలకు బుద్ధి బుద్ధి చెప్పడానికి ప్రజలను చైతన్య పరచడానికి జరిగే ప్రజాగర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోగుల శ్రీనివాస్ గౌడ్ ,మండల కార్యదర్శి కరణం రాజన్న, బుర్ర సమ్మయ్య, తురక రమేష్, బుడమ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 11న కొత్తగూడెంలో ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఐ ప్రజా గర్జన సభాను జయప్రదం చేయండి. – పిల్ల సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి




