Wednesday, 4 November 2026

కాంగ్రెస్ అధికారం లోకి వస్తే ఒకే సారి రూ.2 లక్షలు రుణ మాఫీ – మాజీ మంత్రి సంబాని

పెనుబల్లి, జూన్ 6(జనం సాక్షి) కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే రైతులకు ఒకేసారి రూ .2 లక్షలు రుణమాఫి చేస్తామని టి పి సి సి సీనియర్ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్అన్నారు,మంగళవారం పెనుబల్లి మండలం అగ్రహారం గ్రామంలో జోడో యాత్ర నిర్వహించారు, అయనకు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు, ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కె సి ఆర్ బంగాళాఖాతంలో కలుపు తా ననడం కె సి ఆర్ నమ్మక ద్రోహానికి నిదర్శనం అని అన్నారు,వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు,అధికారంకోసం చేతగాని హామీలిచ్చి ప్రజలను మోసంచేసిన నిన్నే వచ్చే ఎన్నికల్లో మూడు చెరువుల నీళ్లు తాపించ డం కాయమన్నారు, మూడు నెలల్లో బంగాళాఖాతంలో ముంచడానికి రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులతో పాటు రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ సిద్దంగా ఉన్నారని తెలిపారు.
కేసిఆర్ 10 ఏండ్ల పాలనలో తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదు. రుణమాఫీ కాలేదని రైతులు, ఇండ్లు, పింఛన్లు రాలేదని పేదలు, కొలువులు రాలేదని నిరుద్యోగులు బిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్రంగా వ్యతిరేకతతో ఉన్నారన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి ఇస్తామని, వైద్యం కోసం కుటుంబానికి సంవత్సరానికి ఉచితముగా 5 లక్షలు, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీచేస్తామని అన్నారు,నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతీ నెలా రూ. 4000 నిరుద్యోగ భృతి చెల్లింపుతో పాటు, 18 ఏళ్లు పైబడిన చదువుకొన్న బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు పంపిణీ చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు చెలికాని రాజబాబు, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వంకాయలపాటి వెంకటేశ్వరరావు, రామిశెట్టి మనోహర్ నాయుడు, స్టేట్ ఎస్సిసెల్ డిపిటి కన్వీనర్ కొండూరు కిరణ్, దేశిన్ని శ్రీనివాసరావు,గోగినేని రమేష్, మేకతోటి కాంతయ్య, రామదాసు, దేసిన్ని జగన్మోహనరావు, మిద్దె చెన్నకేశవులు, దేసిన్ని చెన్నకేశవులు, బెల్లంకొండ సీతారాములు, బల్లి కాసులు, గుగులోతు బద్రు, దేసిన్ని గోపాలరావు, కిరణ్, ధారావత్ కృష్ణ,బుక్య రవీంద్ర, గుగులోతు గోపాల్, దేశం సత్యనారాయణతదితరులు పాల్గొన్నారు.