Wednesday, 4 November 2026

మంత్రి పర్యటనకు ఏర్పాట్లను పరిశీలించి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

మునిపల్లి, జూన్ 06, జనంసాక్షి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగమేశ్వర ఇరిగేషన్ పథకం రైతుల బాగుకోసమేనని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సాగునీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామ శివారులో ఏర్పాటు చేసి లిఫ్ట్ ఇరిగేషన్ పంప్హౌస్ పనులకు మంత్రి హరీష్రావు భూమి చేయనున్నారు. మంత్రి హరీష్రావు పర్యటన సందర్బంగా మంగళవారం నాడు జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి సభా స్థలిని పరిశీలించి మీడియాతో మాట్లాడారు.. ప్రభుత్వం చేపడుతున్న సంగమేశ్వర ఇరిగేషన్ పథకంతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. పక్కన సింగూరుప్రాజెక్టు ఉన్నప్పటికీ ఒక్క ఎకరా కూడా సాగుకు నోచుకోలేదన్నారు.అందుకు రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ పథకంతో రైతుల రేపురేఖలు మారనున్నాయన్నారు. ప్రాజెక్టులో భూములు కోల్పోతున్నరైతులతో సమావేశాలు నిర్వహించి న్యాయం చేస్తామన్నారు. గతంలో ఎక్కడ లేనింగా నష్టపరిహారాన్ని అందజేస్తామని, రైతులెవరూ ఆందోళన చెందవద్దన్నారు. అలాగే మంత్రి సభకు ప్రతి గ్రామంలో నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం అక్కడ నుంచి పెండింగ్లో ఉన్న తక్కడపల్లి, గార్లపల్లి గ్రామాల మధ్య ఉన్నడబ్బా వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు నీళ్లు ఉండడంతో నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి నాయకులు తీసుకెళ్లడంతో పరిశీలించి పనులు షురూ అయ్యేలా చూస్తానని హామీనిచ్చారు. అంతకు ముందు బీఆర్ఎస్ చిన్నచెల్మెడ గ్రామ శాఖ అధ్యక్షుడు ఒగ్గు మోహన్ జన్మదిన వేడుక ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ సిఈ అజయ్ కుమార్, ఎస్ఈ మురళీధర్, తహసీల్దార్ శివకుమార్, బీఆర్ఎస్ రాష్ర్ట నాయకుడు పైతర సాయికుమార్, మండల అధ్యక్షుడు విజయ్కుమార్, ప్రధాన కార్యదర్శి శశికుమార్, గ్రామ సర్పంచ్ విజయ్ కుమార్, ఎంపీటీసీ మంద రాజశేఖర్, ఉప సర్పంచ్ దత్తుగౌడ్, బీఆర్ఎస్ చిన్నచెల్మెడ గ్రామ అధ్యక్షుడు మోహన్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు పరుశరాం గౌడ్, నాయకులు తదితరులు ఉన్నారు.