Tuesday, 3 November 2026

ఈనెల 15 న టీఆర్ఎస్ లో చేరుతున్నాం

vlcsnap-2016-06-13-13h15m21s4‘కాంగ్రెస్ను వీడుతున్నందుకు బాధగా ఉంది’

హైదరాబాద్ : త్వరలో టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్రావు, రవీంద్ర నాయక్, మాజీ ఎంపీ వివేక్, మాజీమంత్రి వినోద్ అధికారికంగా ప్రకటించారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం మీడియా సమావేశంలో తెలంగాణ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. అయితే కాంగ్రెస్ను వీడుతున్నందుకు బాధగా ఉందన్నారు. అవసరం అయితే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని గుత్తా స్పష్టం చేశారు. మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ రెండేళ్లలో కేసీఆర్ ఎన్నో మంచి పథకాలు చేపట్టారన్నారు. దేవరకొండ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *