Tuesday, 3 November 2026

ఈనెల 20 నుంచి ఉద్యమ కార్యక్రమాలు: కేసీఆర్‌

హైదరాబాద్‌: ఆగస్టు 20 నుంచి మళ్లీ ఉద్యమ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెరాస అధినేత కేసీఆర్‌ వెల్లడించారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగిన స్వామిగౌడ్‌ అభినందన సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తెలంగాణ ఉద్యోగులకు వేతనాలు ఇస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తనకు తాను తెలంగాణ ఇస్తుందని భావించటం లేదని, 5,10 రోజులు వేచి చూద్దామని ఆయన అన్నారు. టీఎన్జీవో నేత స్వామిగౌడ్‌ మాట్లాడుతూ అనేక విమర్శలు ఎదురైనా సకల జనుల సమ్మె చేసినట్లు వివరించారు. ఉద్యమంలో తమను పలువురు కళాకారులు, రాజకీయనేతలు నడిపించారని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *