ఈనెల 21న ఖమ్మంలో జరిగే టీటీడీపీ బహిరంగ సభను జయప్రదం చేయండి
నేరేడుచర్ల (జనంసాక్షి )న్యూస్ :
ఈనెల 21న ఖమ్మంలో జరగనున్న తెలంగాణ టిడిపి బహిరంగ సభను జయప్రదం చేయాలని నల్లగొండ పార్లమెంటు అధికార ప్రతినిధి, నేరేడుచర్ల మండల అధ్యక్షుడు వింజమూరు వెంకటయ్య కోరారు. హుజూర్నగర్ నియోజకవర్గం నుండి అత్యధికంగా జన సమీకరణలో భాగంగా విస్తృత ప్రచారం చేస్తూ నేరేడుచర్ల మండలం వైకుంటపురం గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు పచ్చిపాల వెంకన్న యాదవ్ , గ్రామ పార్టీ అధ్యక్షుడు పిన్నపురెడ్డి రాంరెడ్డి, వనపట్ల లక్ష్మయ్య , వనపట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.




